17 June, 2026 | 3:09 AM

మచ్చుపేట గ్రామపంచాయతీకి తక్షణమే సెక్రటరీని నియమించాలి

17-06-2026 01:49 AM

ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ డిమాండ్

ముత్తారం, జూన్ 16 (విజయక్రాంతి): మచ్చుపేట గ్రామానికి పూర్తిస్థాయి పంచాయతీ సెక్రటరీ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే స్పందించి సెక్రటరీని నియమించాలని గ్రామ ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ కోరారు.

గతంలో సెక్రటరీగా పనిచేసిన లక్ష్మణ్ బాబుపై ఆరోపణలు రావడంతో, ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 6న జరిగిన గ్రామసభకు కూడా ఆయన హాజరు కాలేదని, దీనిపై ముత్తారం ఎంపీడీవో సురేష్ ను వివరణ కోరగా, సదరు సెక్రటరీపై ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, ఈ నెల 07 నుండి సదరు సెక్రటరీ విధుల్లో లేకపోవడం, కొత్త వారిని నియమించకపోవడంతో పాలనా యంత్రాంగం స్తంభించిపోయిందన్నారు.

ప్రజల అవస్థలు

సెక్రటరీ లేకపోవడంతో గ్రామ ప్రజలు కింది పనులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నిర్మాణాలకు అనుమతులు పొందడం, నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, వి ద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేయడంతో పాటుప్రభుత్వ పథకాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందని,ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక గ్రా మానికి వెన్నెముక వంటి పంచాయతీ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంటే ప్రజల పనులు ఎలా జరుగుతాయని, అధికారులు కేవలం ఆరోపణల పేరుతో కాలయాపన చేస్తూ, సామాన్యులను ఇ బ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని, రాకేష్ ప్రశ్నించారు. పాలన గాడిలో ప డాలంటే వెంటనే కొత్త సెక్రటరీని నియమించాలని, లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

సదరు అధికారికి విజ్ఞప్తి

సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే మచ్చుపేట గ్రామానికి కొత్త సెక్రటరీని నియమించాలని కోరుతున్నారు.