calender_icon.png 16 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల పరిశీలన

15-02-2026 12:00:00 AM

పరిశీలించిన ద.మ. రైల్వే అధికారులు

సికింద్రాబాద్,ఫిబ్రవరి 14(విజయ క్రాంతి):  నాంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ది పనులను శని వారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. రూ. 327.27 కోట్ల వ్యయంతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులు ఏ మేరకు పూర్తయ్యా యనే విషయాలను నేరుగా పరిశీలించేందు కు ఆయన రైల్వే అధికారులతో కలిసి నాం పల్లి స్టేషన్‌ను సందర్శించారు.

ఈ సందర్భం గా డివిజనల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాబోయే స్టేషన్ అభివృద్ధి ప్రణాళికల గురించి జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకొనివచ్చారు. ఆయన పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న ప్రదేశంలో పనులను సమీక్షించారు. ఆ తరువాత స్టేషన్ పశ్చిమ వైపున ఉన్న క్యారేజ్ మెయింటెనెన్స్ డిపోను కూడా పరిశీలించారు. డిపో లోని పనితీరు గురించి, సిబ్బందికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.