4 August, 2026 | 1:50 AM

ఎమ్మెల్యే ఆదేశాలతో విద్యుత్ పోల్స్ ఏర్పాటు

04-08-2026 12:46 AM

బోధన్, ఆగస్టు 3 (విజయక్రాంతి): బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్లో విద్యుత్ పోల్స్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజల సమస్యను కౌన్సిలర్ అబ్దుల్ సమీనా మన్నన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి విద్యుత్ శాఖ డీఈకి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో నర్సాపూర్లో విద్యుత్ పోల్స్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యను గుర్తించి తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి, అలాగే సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన కౌన్సిలర్ అబ్దుల్ సమీనా మన్నన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.