16-02-2026 02:08:11 AM
పరీక్షా కేంద్రాల్లో వాల్ క్లాక్ ఉండాల్సిందే
పకడ్బందీగా బోర్డు అధికారుల చర్యలు
ఈ నెల 25 నుంచి పరీక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు అన్ని ఏర్పా ట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసే వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా కాలేజీ యామజాన్యాలు, సంబంధిత అధికారులకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి కేం ద్రంలోని ప్రతి హాల్‌లో గోడ గడియారం ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులు సూ చించారు. ఫ్యాన్లు, సరైన గాలి ప్రసరణ ఉం డాలి, మరుగుదొడ్లు ఉండాలి, తాగు నీరు సదుపాయం, విద్యార్థులను నేలపై కూర్చోబెట్టకుండా పరీక్ష రాసేందుకు డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటు చేసేలా డీఐఈవోలు పర్యవేక్షించనున్నారు. ప్రశ్నపత్రాల భద్రతా ఏర్పా ట్లు, పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని బోర్డు సూచించింది.