calender_icon.png 9 May, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

22-04-2025 11:27:39 PM

ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలో వైఎస్సార్ కాలనీలో సుక్క అరుంధతి (17) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నది. కొత్త పేటలోని నారాయణ కాలేజీలో బైపీసీ ఇంటర్ సంవత్సరం చదువుతున్నది.

మంగళవారం ఫలితాలు విడుద ల కావడంతో తన మార్కులు సరిచూసుకున్నది. వృక్షశాస్త్రంలో ఫెయిల్ కావ డంతో తీవ్ర నిరాశకు గురైంది.  మధ్యా హ్నం 2:20 గంటల ప్రాంతంలో ఇంటి లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గమనించిన కుటుంబ సభ్యులు అరుంధతిని వెంటనే సుప్రజా ఆసుపత్రికి తరలించగా ప్పటికే  చనిపోయి నట్లు వైద్యులు ప్రకటించారు. పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురికావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేర కు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు.