ప్రశాంతంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు
కొత్తగూడెం, ఫిబ్రవరి 26, (విజయక్రాంతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలుమార్చి 2026లో భాగంగా గురువారం నిర్వహించిన ద్వితీయ భాషా (తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, జీఎఫ్సీ) థియరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించబడినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా సాధారణ విభాగంలో 6,743 మంది, వృత్తి విద్యా విభాగంలో 1,895 మంది విద్యార్థులు కలిపి మొత్తం 8,638 మంది విద్యార్థులకు ఉండగా , అందులో సాధారణ విభాగంలో 6,622 మంది, వృత్తి విద్యా విభాగంలో 1,822 మంది కలిపి మొత్తం 8,444 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వెల్లడించారు.
సాధారణ విభాగంలో 121 మంది, వృత్తి విద్యా విభాగంలో 73 మంది కలిపి మొత్తం 194 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒక మాల్ప్రాక్టీస్ కేసు భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నమోదు చేయబడినట్లు తెలిపారు . పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు, తదుపరి రోజు పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు, ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు క్రమబద్ధంగా నిర్వహించబడినట్లు తెలిపారు .




