28 June, 2026 | 4:10 PM

Breaking News

నిండు జీవితానికి రెండు చుక్కలు   •   తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు   •   లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •  

ఇండియా స్కూల్ కోసం స్థలం కేటాయించవద్దు

27-02-2026 12:46 AM

కలెక్టర్‌కి ఫోన్ ద్వారా వివరించిన మాజీ మంత్రి

వనపర్తి టౌన్ ఫిబ్రవరి 26: మెడికల్ కళాశాల ఆవరణంలో యంగ్ ఇండియా స్కూల్ కోసం స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం మెడికల్ కళాశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.

ఈ సందర్బంగా ఆయన కలెక్టర్ కు ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల విద్యార్థులు కలసి తమ కళాశాలకు భవిష్యత్తు తరాలకు వైద్య సహాయ మరియు వసతుల కోసం 51 ఎకరాల స్థలం కేటాయించి భావితరాల భవిష్యత్తుకు తమ హయాంలో పునాది వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్, హేమంత్ ముదిరాజ్ , నీలస్వామి, మహేశ్వర్ రెడ్డి, స్టార్ రహీమ్, వెంకట్ సాగర్, చిట్యాల రాము,మంద రాము తదితరులు ఉన్నారు.