అంతర్జాతీయ ఏఐ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్
హైదరాబాద్‌లో సదస్సు ప్రారంభం
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (అటానమస్), మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్), ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు 2026‘ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డా. వి. కె. సారస్వత్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, పూర్వ డైరెక్టర్ జనరల్‌మిస్త్స్రల్స్, డీఆర్డీవో రాజాబాబు, డైరెక్టర్ జనరల్, డీఆర్డీవో డా. జగన్నాథ్ నాయక్, డైరెక్టర్, ఆర్‌సీఐడీఆర్డీవో అనింద్య విశ్వాస్, డీఐఏటీ, పూణే వైస్ ఛాన్సలర్ డా. బి. హెచ్. వి. ఎస్. నారాయణమూర్తి, ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ చైర్మన్ ఎంజిపిఎల్ నారాయణ, పూర్వ డైరెక్టర్, డీఆర్‌డీవో డా. ఎస్. కె. చౌదరి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.






