ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
10-03-2026 09:30 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిదిలోని అనంతసాగర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని మహిళ ఉపాధ్యాయులైన ఫర్జానా, జ్యోతి, శ్రావ్య, రజిత, చంద్రకళను సత్యనారాయణ, రాఘవేంద్ర, రంజిత్, ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది.




