5 May, 2026 | 1:57 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

హామీలపై పరిమితమైన అనంతారం రోడ్డు

10-03-2026 09:36 PM

గిరిజన గ్రామాలపై కొనసాగుతున్న వివక్ష - సీపీఐ(ఎం)

కారేపల్లి,(విజయక్రాంతి): కారేపల్లి మండలంలో పూర్తి గిరిజన గ్రామమైన అనంతారం వెళ్ళు రహదారి నిర్మాణం హామీలకే పరిమతమైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ 2004లో బీటీ రోడ్డు మంజూరైనా కేవలం కంకర రోడ్డువేసి వదలేశారన్నారు. అప్పటి నుండి కంకరతేలిన రోడ్డుపైనే నిత్యం ప్రయాణిస్తూ 8 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అనంతారం, రేగులగూడెం, రామకృష్ణాపురం గ్రామాల ప్రజలు తప్పని సరిగా రోజూ ఈ రహదారిపైనే రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు సరిగా లేక ఆటోలు రాక పోవటంతో ప్రజలు ఇబ్బంధులు పడుతున్నారు. ఆ రహదారి మరమ్మతులు చేయాలని అధికారులుకు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇస్తున్నా వారు హామీలు ఇవ్వటం తప్ప అచరణలో చూపటం లేదన్నారు.

అనంతారం రహదారిని పరిశీలిస్తే గిరిజన గ్రామాలపై పాలకులు వివక్షత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ రహదారి బాగుకోసం సీపీఐ(ఎం) ఇప్పటికే గ్రామస్తులను సమీకరించి అందోళనరూపంలో ప్రభుత్వం దష్టికి తీసుకవచ్చామన్నారు. ఈరహదారిని ఆర్ అండ్ బీ లేద విశాఖ స్టీల్ డోలమైట్ యాజమాన్యం ద్వారా బీటీ రోడ్డు వేయిస్తామన్నా ప్రజాప్రతినిధులు మాటపై నిలబడలేదన్నారు. ఇప్పటికైనా వైరా ఎమ్మెల్యే ఈ రహదారి పై దష్టి పెట్టి  అనంతారం రైల్వేగేట్ నుండి అనంతారం-చీమలవారిగూడెం- రేగులగూడెం- రామకృష్ణాపురం వరకు బీటి రోడ్డు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.