9 March, 2026 | 9:13 AM

ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం

08-03-2026 04:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచశ్రామిక మహిళ దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్థానిక భగత్ సింగ్ భవనంలో జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే పురుషులతో సమానంగా స్త్రీలకు పాండురంగల అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచే విధంగా సోషల్ మీడియా టీవీ ఛానల్ లో ప్రసారాలు నియంత్రించాలని పేర్కొన్నారు. సమర పనికి సమాన వేతనం అందించాలని మహిళల హక్కులను గౌరవించాలని దాడులను నియంత్రించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి లత రుక్మిణి గంగామణి పాల్గొన్నారు