9 March, 2026 | 9:16 AM

ఆస్తి పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ

08-03-2026 04:40 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయలు ఉన్న యజమానులకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి రెడ్ నోటీసులు అందజేశారు. బకాయి దారులు వెంటనే ఆస్తి పన్ను చెల్లించాలని, చెల్లించకపోతే మున్సిపల్ ఆక్ట్ 2019 ప్రకారం  ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.  కమిషనర్ వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్ ఐ రాములు, వార్డ్ ఆఫీసర్లు స్నేహ లతా రెడ్డి, అనిల్ కుమార్, తేజస్విని, బిల్ కలెక్టర్ హైమద్ తదితరులు ఉన్నారు.