9 March, 2026 | 9:18 AM

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

08-03-2026 04:48 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): గర్భాశయ క్యాన్సర్ నివారణ(Cervical cancer prevention)కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌(HPV vaccine)ను ఆడబిడ్డలు అందరూ వేయించుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.

కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు మహిళలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడబిడ్డలందరికీ ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర, ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ హర్ష, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.