07-10-2024 01:52:56 AM
హాజరుకానున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్‌గౌడ్ ఆదేశాల మేరకు గాంధీభవన్‌లో సోమవారం ‘మంత్రులతో ము ఖాముఖి’ కార్యక్రమం నిర్వహించున్నా రు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే మొన్నటి శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ పర్యటనలో ఉండటంతో.. సోమవారానికి వాయిదా పడింది. కార్యక్రమం ఉద యం 11 గంటలకు ప్రారంభం కానుం ది. మొదటి సారి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెం డోసారి రాష్ట్ర నీటిపారుదల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరైన విష యం తెలిసిందే. ప్రజలు హాజరై తమ సమస్యలు చెప్పుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
అధిష్టానం వివరణ కోరలేదు..
మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం వివరణ కోరిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. వివరణ కోరిన అంశం తన దృష్టికి రాలేదని, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోనే ఆ ప్రస్తావన ముగిసిందన్నారు.