07-10-2024 01:51:14 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ఏర్పడి మరో రెండు నెలల్లో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వరుసగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
తాజాగా ఆదివారం పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ర్టంలోని మిగతా జిల్లాల గ్రంథాలయాల చైర్మన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
కొత్త గ్రంథాలయ సంస్థల చైర్మన్లు
జోగులాంబ గద్వాల నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్ వరాల విజయ్‌కుమార్, నాగర్ కర్నూల్ గంగాపురం రాజేందర్, మహబూబ్ నగర్ మల్లు నరసింహారెడ్డి, వనపర్తి జీ గోవర్ధన్, వికారాబాద్- శేరి రాజేశ్‌రెడ్డి, నిర్మల్ సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్ల - నాగుల సత్య నారాయణ గౌడ్, కరీంనగర్ సత్తు మల్లయ్య, రంగారెడ్డి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి గొల్ల అంజయ్య, కామారెడ్డి మద్ది చంద్రకాంత్ రెడ్డి, మెదక్ - సుహాసిని రెడ్డి