4 May, 2026 | 3:40 AM

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

04-05-2026 02:20 AM

మంచిర్యాల టౌన్, మే 3 : మంచిర్యాల పట్టణంలోనీ ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 1947, మే 3న ఈ దే శంలో పురుడు పోసుకున్నదన్నారు. కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం పార్టీ, సంఘం పాటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు తిరుపతి, చంద్ర మౌళి, పాల్తపు శంకర్, వడ్లకొండ రంజిత్ గౌడ్, గుండొజు రమేష్, శ్రావణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.