4 May, 2026 | 3:39 AM

బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభం

04-05-2026 02:21 AM

మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్ లో ఆదివారం స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ వేసవి శిబిరాన్ని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా డివైఎస్‌ఓ మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు ఉపయోగించుకుని క్రీడా పోటీలలో పాల్గొని, శిక్షణను తీసుకొని క్రీడలలో నైపుణ్యాలను పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి సెలవులలో ఉచితంగా బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఆసక్తి గల క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డాక్టర్ శ్రీనివాస్, కాగజ్ నగర్ ఏడిఈ గోపాల్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అడ్వైజర్ కృష్ణ, వివి బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వివేక వర్ధన్, జయదేవ్, సురేష్ సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.