సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్
సుల్తానాబాద్, మే 07 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ పట్టణ దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు సుల్తానాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు గురువారం అధికారికంగా నియామక పత్రం అందజేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా ఇనుగాల శ్రీనివాస్ మాట్లాడుతూ... నాపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు కి, పెద్దపల్లి మాజీ శాసన సభ్యులు గుజ్జుల రామకృష్ణ రెడ్డి కి, దుగ్యాల ప్రదీప్ రావు కి , పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ్ కి, ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు కి, ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ కి, జిల్లా మాజీ దళిత మోర్చా అధ్యక్షులు లంక శంకర్ కి , కోశాధీకారి కామని రాజేంద్రప్రసాద్ కి, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్ కి బిజెపి కౌన్సిలర్ కందునూరి సమత కుమార్ కి, వాణిజ్య సెల్ అధ్యక్షులు ఎల్లంకి రాజన్న కి జిల్లా, మండల, పట్టణ స్థాయి బిజెపి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. బిజేపి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ ఫలాలను దళిత వర్గాలకు అందేలా చూడటంతో పాటు, అణగారిన వర్గాల సమస్యలపై పోరాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో బిజెపి జెండాను మరింత ఎత్తులో ఎగురవేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి, నాయకత్వం అప్పగించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇనుగాల శ్రీనివాస్ నియామకం పట్ల బిజెపి శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు,






