30 May, 2026 | 7:49 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

వేగవంతంగా దర్యాప్తు చేయండి

24-02-2026 12:54 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పసిపాప మృతి ఘటనపై వేగ వంతంగా విచారణ జరిపించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీ య బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గు జ్జ సత్యం కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ..

దర్యాప్తు ప్రక్రియలో ఎటువంటి ప్రభావాలు లేకుండా పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం ప్రకటించాలని, కుటుంబంలోని ఒక అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ కన్వీనర్ రాజు నేత, ఓయూ జేఏసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు వంశీ నేత, ఓయు జెఏసి చైర్మన్ బాలకృష్ణ,  జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ నేత తదితరులు పాల్గొన్నారు.