5 July, 2026 | 2:36 PM

మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి మంత్రి దామోదరకు ఆహ్వానం

12-06-2024 12:25 AM

 పటాన్‌చెరు/రామచంద్రాపురం, జూన్ 11: ఈ నెల 20న నిర్వహించనున్న తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆహ్వా నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెల్లాపూర్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.