5 July, 2026 | 1:51 PM

టీబీ నిర్ధారణకు పరీక్షలు నిర్వహించాలి

12-06-2024 12:25 AM

కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, జూన్ 11(విజయక్రాంతి): టీబీ వ్యాధి నిర్ధారణకు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా టీబీ కంట్రోల్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో రెగ్యులర్‌గా టీబీ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల నుంచి ఏ ఒక్క టీబీ కేసు మిస్ కాకుండా గుర్తించాలన్నారు.

మహిళా సంఘలతో సమావేశాలు నిర్వహించి టీబీ వ్యాధిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నా రు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ఆశ కార్యకర్తల ద్వారా మందులు పంపి ణీ చేయాలని సూచించారు. స్వచ్ఛంద సం స్థల ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యా ధికారి డాక్టర్ గాయత్రిదేవి, డీసీహెచ్‌వో డాక్ట ర్ సంగారెడ్డి, వైద్యులు రాజేశ్వర్, శశాంక్, అనిల్‌కుమార్, ఉషాకిరణ్ పాల్గొన్నారు.