5 July, 2026 | 3:30 PM

మీరు చెప్పిన లెక్కలు ఎక్కడ మ్యాచ్ కావడం లేదు

11-06-2024 10:52 PM

మహబూబ్‌ నగర్ : వేసవివ కాలంలో తాగునీటి ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే నిధుల నుంచి మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో 100 బోర్లు వేసినట్లు కాగితాల లెక్కలు చెబుతున్నాయి. కానీ ఎక్కడ కూడ మ్యాచ్ కావడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్‌గౌడ్‌తో కలిసి జిల్లా అధికారులతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమిక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడంతో ముందు ఉండేలా అధికారులు మనవత్వంతో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మిషన్‌భగీరథ నీరు ఎక్కడైన వివిధ కంపెనీలుకు ఉపయోగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, వాటిపై ప్రత్యేక శ్రద్ద వహించి భాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

పట్టణంలోని తిరుమల దేవుని గుట్ట దగ్గర బ్రిడ్జి నిర్మించేందుకుగాను రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపి ముందుకు సాగాలని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌పై ఏనలేని అభిమానం ఉందని, మహబూబ్‌నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటు ముందుకు తీసుకుపోవడం ఖాయమన్నారు. త్వరలోనే రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పెద్ద చెరువు నుంచి మురుగునీరు పోతున్న విషయాన్ని ప్రత్యేకంగా అక్కడికి చేరుకుని పరిశీలించారు. నీరు పూర్తిగా నిర్వీర్యం అయిన తరువాత తదుపరి పనులపై సమిక్షిందామని తెలియజేశారు. అంతకుమందు ప్రయివేటు స్కూల్స్ అసోసియేషన్ నేతలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విద్యార్థుల బస్సుల ఫిటెనేస్ చేసుకునేంపదకు మరింత సమయం ఇప్పించాలని కొరగా సంబంధింత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి అవసరమైన గడువును ఇప్పించారు.