27 March, 2026 | 8:50 PM

కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆహ్వానం

07-10-2025 08:42 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రపంచంలో పేరుతో ఏర్పాటైన మొట్టమొదటి గ్రూప్ శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు ఐన సందర్భంగా ఈనెల 26 అక్టోబర్ 2025 ఆదివారం రోజున శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమంలో తలసేమియా బాధిత పిల్లలకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ప్రపూల్ దేశాయ్ రావలిసిందిగా మంగళవారం రోజున తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు కలిసి సన్మానం చేసి వార్షికోత్సవ వేడుకకు రావలసిందిగా ఆహ్వానం అందజేశారు. ఈ వార్షికోత్సవం ద్వారా శ్రీనివాసుల పేరుతో ప్రపంచ రికార్డు నమోదు అవుతుందని, ప్రతి శ్రీనివాసుడు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, గట్టు శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, ఇజ్జగిరి శ్రీనివాస్,  చొక్కారపు శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, జిల్లా శ్రీనివాస్, ఉప్పుగండ్ల శ్రీనివాస్ మరియు గోనె శ్రీనివాస్ పాల్గొన్నారు.