07-10-2025 08:46:06 PM
చిట్యాల (విజయక్రాంతి): మహిళ అదృశ్యమైందని తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ మంగళవారం తెలిపారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి లావణ్య(33) అనే మహిళ అదృశ్యం అయ్యిందని ఆమె తండ్రి సింగిరెడ్డి సత్తిరెడ్డి(70) వ్యవసాయదారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం లావణ్య గత ఆరు నెలలుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది.
ఆమె ఫోన్ కు పలుమార్లు కాల్ చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్‌గా వస్తోందని తండ్రి తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎటువంటి ఆచూకీ దొరకలేదని తెలిపారు. ఈ ఘటనపై గోదావరి జిల్లా సంతపేట గ్రామానికి చెందిన రామ కోటేశ్వరరావు కుమారుడు రవిచంద్ (32) పై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురు చివరిసారిగా కనిపించినప్పుడు తెలుపు రంగు బంజారా దుస్తులు ధరించి ఉన్నట్లు తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి లావణ్య ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టమని చిట్యాల ఎస్ఐ తెలిపారు.