వేడుకకు ఆహ్వానించి ఆపై మూత్రం పోశారు
యూపీలో దళిత బాలుడిపై దారుణం
మనస్తాపంతో ఆత్మహత్య
లక్నో, డిసెంబర్ 24: పుట్టిన రోజు వేడుకలకు పిలిచి అవమానించడంతో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ ప్రాంతానికి చెం దిన 17ఏళ్ల దళిత బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్తీ ప్రాంతానికి చెందిన దళిత బాలుడిని డిసెంబర్ 20న రాత్రి కొందరు స్థానికులు పుట్టి న రోజు వేడుకలకు ఆహ్వానించారు.
వేడుకకు వెళ్లిన అనంతరం అతడిపై దాడికి తెగబడ్డారు. బలవంతంగా బట్టలు విప్పించి, ఆపై మూత్ర విసర్జన చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లలో రికార్డు చేశారు. ఎవరికైనా చెబితే వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తామని బాలుడిని బెది రించారు. దీంతో ఆ బాలుడు తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






