పాక్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్
హోర్ముజ్ గుండా అనుమతి నిరాకరణ
టెహ్రాన్, మార్చి 25: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో పాకిస్థాన్ ఓడను ఐఆర్‌జీసీ నౌకాదళం బుధవారం వెనక్కి పంపింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఏవైనా తమ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇరాన్ షరతులు విధించిన విషయం తెలిసిందే. చట్టపరమైన నిబంధనలను పాటించనందున, పాక్‌లోని కరాచీకి వెళ్తున్న ‘సెలీన్’ అనే నౌకను ఇరాన్ అధికారులు వెనక్కి పంపారు.
చట్టపరమైన నిబంధనలను పాటించకపో వడం, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతి లేకపోవడం వల్ల కంటైనర్ షిప్ ‘సెలీన్’ను ఐఆర్‌జీసీ నౌకాదళం వెనక్కి పంపిందని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం బుధవారం ఎక్స్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది.




