14 July, 2026 | 1:03 PM

ఐఆర్‌ఈడీఏకు నవరత్న హోదా

30-04-2024 12:10 AM

భారీగా పెరిగిన షేరు

ముంబై, ఏప్రిల్ 29: ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. ఈ హోదాతో కంపెనీ బోర్డు ప్రభుత్వం అనుమతి లేకుండానే పెద్ద ప్రాజెక్టులను చేపట్టగలుగుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ నవరత్న హోదా ఇచ్చినట్టు స్టాక్ ఎక్సేంజీలకు ఐఆర్‌ఈడీఏ తెలిపింది. ఈ వార్తతో సోమవారం ఐఆర్‌ఈడీఏ షేరు వువ్వెత్తున పెరిగింది. ఇంట్రాడేలో ఇది 13 శాతం ఎగిసి రూ.192 వద్ద గరిష్ఠస్థాయిని తాకింది. ఇప్పటివరకూ ఐఆర్‌ఈడీఏకు బీఈఎంఎల్, ఆర్‌ఆర్‌ఎఫ్‌సీ, బీఎస్‌ఎన్‌ఎల్, హిందుస్థాన్ కాపర్, ఐఆర్‌సీటీసీల తరహాల్లో మినిరత్న హోదా ఉన్నది. నవరత్న హోదాతో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ తదితర పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల సరసన ఐఆర్‌ఈడీఏ చేరింది.