మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ
30-04-2024 12:05 AM
రూ.7.49 లక్షల ఎంట్రీలెవల్ ధరతో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో విడుదల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మహీంద్రా అండ్ మహీంద్రా మరో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ మోడల్‌ను విడుదల చేసింది. వినియో గదారులు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కాంపాక్ట్ ఎస్‌యూ వీని కంపెనీ సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రాచుర్యం పొందిన ఎక్స్‌యూవీ 300 మోడల్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. తాజా మోడల్ ఎంట్రీలెవల్ ధర రూ.7.49 లక్షలు కాగా, వివిధ వేరియంట్లకు ధర మారుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.15.49 లక్షల మేర ఉంటుంది.






