తవ్విన కొద్దీ అక్రమాలు
నిర్మల్ లో రూ.200 కోట్ల సీఎం సిఎంఆర్ బియ్యం మాయం
ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు
విజిలెన్స్ దాడితో ఉక్కిరిబిక్కిరి
పెద్ద చేపలపై ప్రభుత్వం నజర్
నిర్మల్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) ఆధ్వర్యంలో కేటాయించిన సిఎంఆర్ బియ్యంలో తొవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 2022-23 ఖరీఫ్ రబి సీజన్ నుండి2026 రవి సీజన్ వరకు జిల్లా వ్యాప్తంగా 200 కోట్ల విలువచేసే సిఎంఆర్ బియ్యం మాయమైనట్టు విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులు వద్ద మద్దతు ధరతో కొనుగోలు చేసిన వరి ధాన్యం ను పౌరసరపాల శాఖ రైస్ మిల్లర్లకు కేటాయిస్తోంది.
ఇచ్చిన వరి ధాన్యంలో క్వింటాలకు రైస్ మిల్లర్లు 67 సిఎంఆర్ ( కష్టం మిల్లింగ్ రైస్) రూపంలో ప్రభుత్వానికి తిరిగి అప్పగించవలసి ఉంటుంది. 2022 23 నుండి గత నాలుగు సీజన్లలో జిల్లా వ్యాప్తంగా చాలా రైస్ మిల్లులో కేటాయించిన ధాన్యంకు బదులు బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చి బయట మార్కెట్లో అమ్ముకున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బియ్యానికి మంచి రేటు ఉండడంతో ప్రభుత్వ లోసగులు, ప్రజా ప్రతినిధుల పైరవీలు, రాజకీయ పలుకుబడి, అధికారుల అండతో కొందరు ఆ బియ్యాన్ని దారి మళ్లించి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున విక్రయించినట్లు ప్రచారం జరుగుతుంది.
జిల్లాలో మొత్తం 78 రైస్ మిల్లులు ఉండగా ఇప్పటివరకు 45 పైగా రైస్ మిల్లు సిఎంఆర్ బియ్యం బకాయి ఉండడమే ఎందుకు నిదర్శనం. సీఎంఆర్ బియ్యాన్ని గడువు లోపల అప్పగించాలని జిల్లా స్థాయిలో కలెక్టర్, అదరపు రెవెన్యూ కలెక్టర్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎన్నిసార్లు సమీక్షించి హెచ్చరించిన రైస్ మిల్లు వ్యాపారులు మాత్రం ప్రభుత్వ సరుకులు పక్కదారి పట్టించి కోట్లు సంపాదించినట్టు ప్రచారం జరుగుతుంది
జిల్లాలో ముమ్మరమైన విజిలెన్స్ దాడులు
జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ కేటాయించిన దాన్యం సిఎంఆర్ బియ్యం పై రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించడంతో అనేక చోట్ల సీఎంఆర్ గల్లత్తు అయినట్టు తేట తెల్ల మవుతుంది. ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లు తనిఖీ చేస్తే 40 కోట్ల విలువ చేస్తే సిఎంఆర్ బియ్యం గల్లత్తు కావడంతో పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు పెట్టారు. సారంగాపూర్ మండలంలోని రెండు రైసుమిల్లల్లో 20 కోట్ల సీఎం ఆర్ బియ్యం గలత్తు కావడంతో నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో యజమానులను అరెస్టు చేసి జైలుకు పంపారు.
అలాగే కుంటాల మండలంలోని ఓ రైస్ మిల్ 30 కోట్ల విలువ చేస్తే బియ్యం మాయం చేసినట్టు ప్రచారం జరిగింది. లోకేశ్వరం ముధోల్ తానూర్ బైంసా రూలర్ బాసర్ దిల్వార్పూర్ మామడా దగ్గర మండలాల్లో కూడా ఇటీవలే విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా కోటి రూపాయలు నుంచి రెండు కోట్ల విజయం మాయం అయినట్టు తెలిసింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 43 రైస్ మిల్లర్లకు నోటీసులు అందించగా కేవలం పది మంది వరకు మాత్రమే స్పందించడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ సీఎం పెండింగ్ ఉన్న యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడంతో ఇప్పటికే చాలామంది జైలు పాలు అయినట్టు ప్రచారం జరుగుతుంది.
ఎన్ని రోజుల వరకు రైస్ మిల్లు స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులతో ఒత్తిడి తెప్పించి తప్పించుకున్న ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చాలామంది చాలా ప్రాంతాల్లో రైస్ మిల్లర్లను నిర్వహించేవారు ప్రజాప్రతినిధులే కావడం గమనహరం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. గత నెల రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా సిఎంఆర్ పెండింగ్ ఎక్కువగా ఉన్న రైస్ మిల్లలను తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ అధికారులు అక్కడ దాన్యం బియ్యం రెండు లేకపోవడంతో వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు
జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి
నిర్మల్ జిల్లాలో సిఎంఆర్ బియ్యం పెండింగ్ పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన గడువు మేరకు సీఎంఆర్బిఎం కేటాయించని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటూనే విజిలెన్స్ అధికారుల దాడులను చేయిస్తున్నారు. జిల్లాలో కోటికి పైగా పెండింగ్ ఉన్న రైస్ మిల్లర్లపై మొదటగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతివారం సమీక్ష నిర్వహించి పురోగతిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రెవిన్యూ కలెక్టర్ పౌరసరఫరాల అధికారి డిఎం సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ బియ్యం రాబట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ వరకు ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా సిఎంఆర్ పెండింగ్ రాబట్టుకునేలా అధికార యంత్రం చర్యలు చేపట్టడం జరుగుతుంది.
గడువులోపు అందించాల్సిందే
నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం పెండింగ్ ఉన్న రైస్ మిల్లు ప్రభుత్వం విధించిన గడువు లోపల బియ్యం అప్పగించాలని జిల్లా పౌరసర్ వల్ల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పటికీ పెండింగ్ ఉన్న రైస్ మిల్లులకు నోటీసుగాలు అందించామని అందించకపోతే ఆర్‌ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.