అంగడి సరుకుల గోల్మాల్
సంక్షేమ విద్యార్థుల జీవితాలతో చెలగాటం!
- విద్యార్థులకు అందించే సామగ్రి కొనుగోళ్లలో అధిక ధరలు
- పీఎంయూపై విమర్శలు
- కందిపప్పు కిలోకు రూ. 159..
- బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్ ధర రూ. 80 మాత్రమే
- క్లీనింగ్ సామగ్రి ధరల్లోనూ భారీ వ్యత్యాసం
- కొన్ని వస్తువుల ధరల్లో 100 శాతం తేడా
- ఏడు లక్షల మంది విద్యార్థుల సంక్షేమంపై నీలినీడలు
* నాణ్యతా ప్రమాణాల్లో అస్పష్టత..
- టెండర్ నిబంధన(tender conditions)ల్లో ముఖ్యమైన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. బ్రాండెడ్(branded) కాని, వదులుగా (లూజ్) సరఫరా చేసే వస్తువులకు సంబంధించి అన్ని ఉత్పత్తులకు స్పష్టమైన స్పెసిఫికేషన్లు, నమూనాల(samples)ను నిర్దేశించలేదని ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న వర్గాలు చెబుతున్నాయి.
నాణ్యతకు సంబంధించి స్పష్టమైన ప్రమాణాలు లేకపోతే, తక్కువ నాణ్యత కలిగిన వస్తువులు సరఫరా(Supply of goods) అయ్యే ప్రమాదం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సామగ్రి ఏడు లక్షల మంది సంక్షేమ విద్యార్థులకు చేరనున్న నేపథ్యంలో, నాణ్యతలో ఏ చిన్న రాజీ జరిగినా వారి ఆరోగ్యం(Health), పోషకాహారంపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : ఏడు లక్షల మంది సంక్షేమ విద్యార్థుల(welfare students)కు అవసరమైన వివిధ సామగ్రి(materials), వస్తువులు, సౌకర్యాల కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్(Project Management Unit) (పీఎంయూ) చేపట్టిన భారీ కొనుగోలు ప్రక్రియ(Purchasing process)పై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎంయూ ఆమోదించిన ధరలు ప్రస్తుత మార్కెట్ ధరల కంటే గణనీయంగా అధికంగా ఉన్నట్లు మార్కెట్లో ధరలను పరిశీలస్తే అర్థమవుతోంది.

కొన్ని వస్తువుల ధరలు దాదాపు 100 శాతం వరకు అధికంగా ఉండటం ఆందోళన కలిగించే.. అనుమానించే అంశమేనని చెప్పవచ్చు. ఇలా బహి రంగ మార్కెట్ ధరలకన్నా అధిక ధరలకు కొనుగోలు చేయడంతో.. ప్రజాధనంపై అదనపు భారంతో పాటు, పేద విద్యార్థులకు అందాల్సిన వస్తువుల నాణ్యత విషయంలోనూ రాజీ పడే అవకాశం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ టెండర్ల(Government tenders)ను పరిశీలిస్తున్న వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొనుగోలు ప్రక్రియలో పప్పులు, ధాన్యాలతో పాటు శుభ్రపరిచే సామగ్రి కూడా ఉంది.
డీసీఏ బెంచ్‌మార్క్ సిరీస్‌లో పేర్కొన్న ధరలను హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్(Hyderabad Wholesale Market) ధరలతో పోల్చితే రెండింటి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్టు కనపడుతుంది. కంది పప్పును పీఎంయూ కిలోకు రూ. 159 చొప్పున కొనుగోలుకు ఆమోదం తెలపగా.. మార్కెట్లో కందిపప్పు ధర కిలోకు సుమారు రూ. 80గా ఉండటం గమనార్హం. అలాగే పెసరపప్పు కిలోకు రూ. 148 లకు కొనుగోలు చేయగా.. మార్కెట్లో రూ. 100కే లభిస్తోంది.
మినప్పప్పు కిలో రూ. 140కు కొనుగోలు చేయగా.. బయటి మార్కెట్లో రూ. 100కే లభిస్తోంది. శనగపప్పు రూ. 113 ఉండగా.. మార్కెట్లో 80కి లభిస్తుందని పేర్కొంటున్నారు. మొత్తం పప్పులు, ప ప్పుధాన్యాల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం పెసల్లు కిలోకు రూ. 108కు ఆమోదించగా, మార్కెట్ ధర రూ. 90 మాత్రమే ఉంది.
శనగలు రూ. 100 ధర అని నిర్ణయించగా.. మార్కెట్లో రూ. 70, మి నుములు రూ.98గా నిర్ణయించగా, మార్కె ట్లో రూ. 60లకే లభించడం ఇక్కడ ప్రస్తావనార్హం. అలసందలు కిలోకు రూ. 98 చొప్పు న, బొబ్బర్లు రూ. 105 చొప్పున ఆమోదించగా, మార్కెట్లో వాటి ధరలు వరుసగా రూ. 60, రూ. 70గా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఉలవలు కిలోకు రూ. 70 ధర ఆమోదించగా.. మార్కెట్లో వాటి ధర రూ. 40గా ఉంది.
శుభ్రపరిచే సామగ్రిలో మరింతగా..
క్లీనింగ్ మెటీరియల్స్‌కు సంబంధించి ఆ మోదించిన ధరలు, బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకు మధ్య వ్యత్యాసం మరిం త భారీగా ఉండటం గమనార్హం. బ్లీచింగ్ పౌ డర్ కిలోకు రూ.70 ఆమోదించగా, మార్కె ట్ ధర కేవలం రూ. 15గా ఉంది. ఫినాయిల్ లీటరుకు రూ. 60 ఆమోదించగా.. బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 20కే లభిస్తు న్నట్లు మార్కెట్ పరిశీలనతో తేటతెల్లం అవుతోంది. ఈ వస్తువులు కేటగిరీ-బీ (వోలటైల్ కమాడిటీస్) కిందకు వస్తాయి. నిజానికి ఈ కేటగిరీలోని వస్తువుల ప్రాథమిక ధరలు మా ర్కెట్ బెంచ్‌మార్క్‌కు అనుసంధానమై ఉం డాలి. ఈ నేపథ్యంలో, ధరలను ఎలా నిర్ణయించారనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
బ్రాండెడ్ వస్తువుల ధరలపైనా అనుమానాలు..
బ్రాండెడ్ వస్తువుల విషయానికి వస్తే.. వస్తువుల సరఫరాకు ఎంపికైన నాకాఫ్ (ఎన్ఏసీవోఎఫ్) సంస్థ అందిస్తున్న ధరలు టీఆర్పీ ధరల కంటే కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో హోల్‌సేల్ కొనుగోలు జరిగినప్పుడు సాధారణంగా టీఆర్పీ ధరలపై కనీసం 30 శాతం వరకు తక్కువకే ల భించే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గా లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియ ఎంతవరకు సక్రమంగా సాగిందన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సరఫరాదారు అర్హతలపైనా సందేహాలు..
సరఫరాదారు సంస్థకు సంబంధించి గతంలో నెలకొన్న సంఘటనలపైనా ప్రశ్న లు తలెత్తుతున్నాయి. నాకాఫ్ (ఎన్ఏసీవోఎఫ్) సంస్థ ప్రభుత్వంలోని వేరే శాఖ పరిధి లో డిఫాల్టర్‌గా ఉన్నట్లు సమాచారం. ఇ లాంటి రికార్డులు ఉన్న నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో ప్రభుత్వ సంక్షేమ విద్యార్థులకు కావాల్సిన వస్తువులు, ఆహార సామగ్రి సరఫరా ఒప్పందానికి ఆ సంస్థను ఎలా పరిగ ణనలోకి తీసుకున్నారు. గతంలో ఆ సంస్థ పనితీరు, ప్రభుత్వ బకాయిలు, నిబంధనల అమలు వంటి అంశాలను టెండర్ పరిశీలన సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారా అ నేది అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
నాణ్యతా తనిఖీలు.. ధృవీకరణ..
ఈ నేపథ్యంలోనే.. కొనుగోలు ప్రక్రియపై పూర్తి స్థాయిలో సమీక్షించాలని, అలాగే గు ర్తింపు పొందిన సంస్థలతో నాణ్యత ధృవీకరణ చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సరఫరా చేసే వస్తువుల పరిమాణాన్ని కూడా తరచుగా తనిఖీ చేసి నిర్ధారించాల్సిన అవస రం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇలాంటి పర్యవేక్షణ లేకపోతే నాసిరకం వస్తువులు సరఫరా చేయడం, ఆమోదించిన పరి మాణం కంటే తక్కువ సరఫరా చేయడం లాంటి అంశాలకు అవకాశం ఏర్పడుతుంద ని వారు హెచ్చరిస్తున్నారు.
విద్యార్థుల ప్రయోజనాలే కీలకం..
ప్రస్తుత ఆర్డర్‌ను ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తే, ధరలు అధికంగా ఉం డటం, నాణ్యత లోపాలపై అటు ప్రభుత్వం, ఇటు నాకాఫ్ (ఎన్ఏసీవోఎఫ్) తీవ్రంగా విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది. సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసే ఈ సంక్షేమ పథకం పరిమాణం దృష్ట్యా.. ప్రజాధనం వృథా అవు తోందని, సరఫరా చేసే వస్తువుల నాణ్యతపై అనుమానాలు ఏర్పడటం వల్ల సంక్షేమ పథకాలపై ప్రజల్లో నమ్మకం సడలుతుంది.
అందువల్ల, ఈ వ్యవహారంలో ప్రజాధనాన్ని రక్షించడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలని పరిశీలకులు సూచిస్తున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా కొనుగోలు ధరలు నిర్ణయించారా? నాణ్యతా ప్రమాణాలు స్పష్టంగా ఉ న్నాయా? సరఫరాదారు గత రికార్డును సక్రమంగా పరిశీలించారా? వంటి ప్రశ్నలకు సం బంధిత అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత ధరలు, నాణ్యతా ప్రమాణాలపై స్వతంత్రం గా ధృవీకరణ చేపట్టి, అవసరమైతే ప్రస్తుత ఆర్డర్‌ను రద్దు చేసి పారదర్శకంగా కొత్త టెండర్లను నిర్వహించడం వల్ల ప్రజాధనాన్ని సక్రమంగా, సమర్థవంతంగా వినియోగిస్తున్నారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించవచ్చని ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
టెండర్‌ను రద్దు చేయాలనే డిమాండ్..
టెండర్ ప్రక్రియ సరైన విధానంలోనే ఖరారైందని చెబుతున్నప్పటికీ.. మార్కెట్ ధరలతో పోలిస్తే నిర్ణయించిన ధరల్లో కనిపిస్తున్న భారీ వ్యత్యాసాలు, మరోవైపు వదులుగా సరఫరా చేసే వ స్తువులకు స్పష్టమైన నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తే.. మొత్తం టెండర్ ప్రక్రియపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.
ప్రస్తుత సరఫరా ఆర్డర్‌ను రద్దు చేసి, మరింత కఠినమైన నిబంధనలతో కొత్త టెండర్‌ను పిలవాలని సంక్షేమ పథకాలను పరిశీలిస్తున్న వర్గాలు డిమాండ్ చే స్తున్నాయి. కొత్త ప్రక్రియలో ధరల్లో పారదర్శకత, నాణ్యతకు స్పష్టమైన ప్రమాణాలు, పోటీకి సమాన అవకాశాలు ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు.






