15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సాగునీరు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

09-06-2025 08:35 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): సీతారామ కాలువ నుండి జిల్లాకు సాగునీరు అందించాలని, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ(BRS Party) మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు(former MLA Rega Kantha Rao) పిలుపు మేరకు‌ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర కాలం నుండీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా సాగునీటి ప్రాజెక్టులు లేవని, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ ఎత్తి పోతల పధకం నెలకొల్పినారు అని అన్నారు.

దాదాపు 90 శాతం పనులుపుర్తి చేసారు.అమలుగాని హామీల ఇచ్చి గద్దెనేక్కిన  కాంగ్రెస్ ప్రభుత్వం  హంగు ఆర్భాటాలు చేయటం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.ముగ్గురు మంత్రులు ముందుగా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోవటం మాత్రం దుర్మార్గం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లా కు సాగు నీరు ఇవ్వాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేడగం లక్ష్మి నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేస్వరా రావు, సారపాక పట్టణ అధ్యక్షులు కొంకాంచి శ్రీను, బిఆర్ టియు నాయకులు సానికొమ్మ శంకర్ రెడ్డి, బొల్లు సాంబ శివ రావు, మైనారిటీ అధ్యక్షులు సాధిక్ పాషా, గుల్ మొహ్మ్మద్, సెల్ అధ్యక్షులు వళదాసు సలయ, బెజ్జంకి కనక చారి, చెక్క నర్సింహా రావు, ఏసొబ్, కొమటిరెడ్డి రాజశెఖర్ రెడ్డి, చిన్నపారెడ్డి, బాలి రెడ్డి,శనగా అప్పారావు ,మెడగం శ్రీను వాసిరెడ్డి, బానొతు వంశీ, పంగి సురేష్, మేక పున్నం,రాయల నరెంద్ర,కాకాని రాంబాబు, రాఘవులు పాల్గొన్నారు.