ఇరుముడి.. ‘చిరు’నవ్వుల సడి!

14-09-2026 | 05:30am

‘ఇరుముడి’ (Irumudi) సినిమా అంచనాలను మించి ప్రేక్షకులను నుంచి అద్భుత ఆదరణను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ సినిమాపై అగ్ర నటుడు చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.

మూవీ కోర్ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించి మరీ వారిని వ్యక్తిగతంగా అభినందించారు మెగాస్టార్. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ సందర్భంగా వారితో కలిసి ముచ్చటించారు. ఈ ఆనంద క్షణాన ‘చిరు’నవ్వుల సడి చేయడమే ‘ఇరుముడి’ టీమ్ వంతయింది. 

మరిన్ని వార్తలు