ఆగస్టు 21న ఇరుముడి
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజాచిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్‌నకు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనా లు నెలకొన్నాయి. ఇదే ఉత్సాహంతో చిత్రబృందం తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భం గా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటు న్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ, శివ నిర్వాణ పూర్తి అంకి తభావంతో పని చేస్తూ సినిమాను అద్భుతం గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కు మార్; డీవోపీ: విష్ణు శర్మ; ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.






