9 June, 2026 | 2:08 AM

పోలీస్ కంప్లైంట్ ఇండస్ట్రీ హిట్ ఖాయం

09-06-2026 01:22 AM

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముం దుకు రానుంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేశ్, దిల్ రమేశ్, సత్తెన్న ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా చిత్రంలో సూపర్‌స్ట్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మా చిత్రాన్ని, ముఖ్యంగా కృష్ణపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్‌కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది.

హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి” అని చెప్పారు. ఈ చిత్రానికి డీవోపీ: ఎస్‌ఎన్ హరీశ్ సొండెకొప్ప; సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో.