20 July, 2026 | 5:37 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

డిగ్రీ కాలేజ్ కలేనా?

20-07-2026 12:00 AM
  1. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఫలితం శూన్యం
  2. ప్రజా ప్రతినిధులు స్పందించాలి

తూప్రాన్, జూలై 19 : తూప్రాన్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. తూప్రాన్ పట్టణ ప్రజల పరిసర గ్రామ ప్రజల, సమీప మండలాల పరిధిలోని గ్రామాల విద్యార్థులు తూప్రాన్ పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు నేటికి కలగానే మిగిలిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా డిగ్రీ కాలేజీ నిర్మాణం కొరకు చొరవ చూపలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తూప్రాన్ పట్టణంలో 50 పడకల దవఖాన నిర్మాణం చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రారం భోత్సవానికి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సమయంలో తూప్రాన్ పట్టణ కేంద్రంలోని ప్రముఖ నాయకులు మాజీ ముఖ్యమంత్రితో తూప్రాన్ లో డిగ్రీ కాలేజ్ కావాలని అడిగారు. అందుకు మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తూ అతి త్వరలో మీ కలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలకు మంత్రులు తూప్రాన్ పట్టణానికి వస్తున్నారు పోతున్నారు,

వారి దృష్టికి తూప్రాన్ పట్టణ ప్ర జాప్రతినిధులు డిగ్రీ కాలేజీ లేదన్న విషయా న్ని గుర్తు చేయకపోవడం శోచనీయం. మెద క్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపల్ ప్రధాన పట్టణంగా ఏర్పాటయింది, వ్యాపారంతో పాటు వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో ఒకటిగా తూప్రాన్ పే రొందినది. ఇలాంటి తూప్రాన్ పట్టణంలో నేటికీ డిగ్రీ కాలేజీ లేదు అన్న విషయం ప్రజ లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్నిబట్టి ప్ర జా ప్రతినిధుల ఆలోచనలు ఏ స్థాయిలో ఉ న్నాయో తూప్రాన్ అభివృద్ధిలో ఏ పార్టీలు పని చేస్తున్నాయో వారే గమనించాలి.

దృష్టి సారించాలి.. 

అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి. తూప్రాన్ లో నేటికీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా విచారకర విషయమని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంత మంది ప్రజాప్రతినిధులు వచ్చిన దీనిపై దృష్టి కేంద్రీకరించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మా ప్రాంతంలోని పై చదువులు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు ప్రజాప్రతినిధులు ఇకనైనా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.

 సర్గల నర్సింలు, తూప్రాన్