20 July, 2026 | 4:53 AM

SIR ప్రక్రియ చాలా కీలకం... ఎవ్వరు నిర్లక్ష్యం చేయవద్దు

19-07-2026 04:55 PM

సర్ ప్రక్రియపై చిన్న నిర్లక్షాన్ని కూడా సహించేది లేదు

హైదరాబాద్: SIR ప్రక్రియ చాలా కీలకమైనది, ఎవరూ కొంచం కూడా నిర్లక్ష్యం చేయవద్దని జూమ్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. నాయకులు అందరూ వారి నియోజక వర్గాలలో సర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ వరకు సర్ ప్రక్రియపైనే ఉండాలని, చిన్న నిర్లక్షాన్ని కూడా సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు సర్ పనులను వేగవంతం చేయాలన్నారు. బీఎల్ఏ లకు సహకారం అందించాలని కోరారు. దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలను గుర్తించి ఇక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎంత కష్టపడుతామో అలాగే ఇప్పుడు ఈ పనులను చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సర్ పనులు పూర్తయ్యే వరకు నియోజకవర్గాలలో ఉండాలన్న పీసీసీ చీఫ్ అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోవొద్దని వివరించారు.