7 March, 2026 | 8:23 PM

బాలల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

14-11-2025 12:00 AM

‘నేటి బాలలే రేపటి పౌరులు’. వా రి శ్రేయస్సు దేశాభివృద్ధికి మూ లం. బాలల సంక్షేమం, అభివృద్ధిపై పెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక. బాల్యాన్ని ఆ నందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే బాల్యదశ కీలకమైంది. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. బాల్యం లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు తదనంతర జీవితంపై తీవ్ర ప్రభావం చూపు తాయని మానసిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో పేర్కొన్నారు.

ఇంటివద్ద, బడిలో ఆహ్లదకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి కావలసిన పరిస్థితులు కల్పిం చి, వారికి కావాల్సిన వనరులు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు సమాజం మీద కూడా ఉంది. కోవిడ్ మ హమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు విద్యా వ్యవస్థ కూడా తీవ్ర ప్రభావానికి గురైంది. కరోనా కాలంలో చాలా కా లం పాటు పాఠశాలలు మూతబడడంతో పాటు ఉద్యోగాలు ఊడిపోవడం, పరిశ్రమలు మూతపడడం వల్ల దేశంలో నిరు ద్యోగం పెరిగిపోవడం, సరైన ఆదా యం లేక ఆ ప్రభావం కుటుంబాలపై, పిల్లల జీ వితాలపై పడింది. 

ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి, పేద వ ర్గాలకు చెందిన కోట్లాది మంది బాలలకు కనీస సౌకర్యాలు లేకపోవడం, వారి ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని కటిక దారి ద్య్రంలో బతుకుతున్నారని ఇటీవల యూ నిసెఫ్  సంయుక్తంగా నిర్వహించిన సర్వేకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది.

80 శాతం పేదరికంలోనే..

ప్రపంచబ్యాంకు ప్రకారం ప్రపంచ దేశాల్లో 1981 సంవత్సరంలో ఉన్న పేద లు 2010 నాటికి కూడా ఇంకా పేదలుగానే ఉన్నారని,  పేదరికంలో జీవిస్తున్న బాలల సంఖ్య మారలేదని ప్రపంచబ్యాం కు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కింగ్ వెల్లడించారు.  నిరుద్యోగంతో పాటు బాల కార్మి కుల సంఖ్య పెరగడానికి పేదరికమే ప్రధా న కారణమని ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త కౌశిక్ బసు తెలిపారు.

2013 నాటికి అభివృధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదా యం 1.90 డాలర్లు సంపాదిస్తున్న కుటుంబాల్లో 19.5 శాతం బాలలు పేదరికంలో ఉన్నట్లు తేలింది. యూనిసెఫ్ అధ్యయనం ప్రకారం కోవిడ్ మహమ్మారి వల్ల అభివృ ద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాలలకు కావలసిన విద్యా, వైద్యారోగ్య, గృహ వసతి, పోషకాహారం, పారిశుద్ధ్యం, తాగు నీరు అందుబాటులో లేని బాలల సంఖ్య 125 కోట్లు అని తెలిపింది. వీరికి అదనంగా మరో 15 కోట్ల మంది ఈ మ ధ్యకాలంలో చేరడంతో ప్రపంచంలో పేదరికం పెరగడానికి దారి తీసినట్లయింది.

‘ప్రపంచ బ్యాంక్  సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం భారత్‌లోనూ దాదాపు 30 శాతానికి పైగా బాలలు కఠిన పేదరికంలో అధ్యయనంలో తేలింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏ డు దశాబ్ధాలు కావొస్తున్నా కేంద్రం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాల్లో ఇప్పటికీ భారత్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, పేద, బడుగు బలహీనవర్గాలకు అందకపోవడం వల్లే ఈ వర్గాల్లో 80 శాతం మంది బాలలు కడు పేదరికాన్ని అనుభవిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఐదేళ్ల లోపు బాలల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అత్యంత పేదరిక కు టుంబాలలో నివసిస్తున్నారు. పేద, మధ్య, అల్ప ఆదాయ దేశాల మీద ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. 

కఠిన చట్టాలతోనే..

జనాభాలో చైనాతో పోటీ పడుతున్న మన భారత్‌లో బాలలకు పౌష్టికాహారానికి సంబంధించిన పథకాలు, అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముంది. అందుకోసం ప్రభుత్వాలు సమగ్రమైన కార్యచరణ ప్రణాళికలు అమలు చేయాలి. బాలల కనీస అవసరా లు తీర్చి వారి వికాసానికై ప్రభుత్వాలు బా ధ్యతగా వ్యవహరించాలి. దీనికై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో బాలల హక్కుల రక్షణ కు సంబంధించిన 1989 నాటి అంతర్జాతీయ ఒడంబడికను ప్రపంచ దేశాలు క్షేత్ర స్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలి.

భారత్‌లోనూ పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఉపాధి అవకాశాలు కల్పించ డంతో పాటు, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలి. ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. భారతదేశ జనాభాలో 37 శాతం బాలలున్నారు.  పిల్లలను పేదరికం నుండి విముక్తి చేయడానికి కుటుంబ సామాజిక భద్రత కార్య క్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి సుకన్య సమృద్ధి, మిషన్ వాత్సల్య వంటి ఆర్థిక సాధికారక కార్యక్రమాలు అమలుచేయాలి.

పిల్లల్లో ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందిం చాలి. బాలల అభివృద్ది శిశు దశలోనే మొదలవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయా లి.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సమీకృ త గురుకులాలు, మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నది. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారిలో దాగి ఉన్న సృజనా త్మకతను వెలికితీసి, నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. అధిక జనాభా గల భారత దేశం పిల్లల హక్కుల సంరక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. 

అవగాహన అవసరం

భారత్‌లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మధ్యాహ్న భోజన సదు పాయం అవసరం. హింస, దుర్విచక్షణల నుంచి పిల్లలను విముక్తి చేయడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కృషి చేయాలి. పిల్లల హక్కులను ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక మంత్రిత్వ శాఖ సమిష్టిగా బాలల అభివృధి సంక్షేమ చట్టాలను పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పేద వర్గాల ప్రజలను సామాజిక, ఆర్థికాభివృధి ప్రణాళికలో భాగస్వాములను చె య్యాలి. 

రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ప్రకా రం పిల్లలను అన్ని రకాల బలవంతపు  వెట్టి చాకిరీ , గనుల్లో పని చేయడాన్ని నిషేధిస్తూ కఠిన నిబంధనలు అమలు చేయా లి. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం బాలలకు స్వేచ్ఛ, గౌరవం, ఆహ్లదకరమైన వాతావరణంలో ఎదిగే అవ కాశం కల్పించాలి. పేదవర్గాల బాలలకు ఉచితంగా డిజిటల్ టెక్నాలజీ పరికరాలు అందించాలి. పిల్లలకు బాల్య దశ నుంచి ప్రశ్నించే తత్వం పెంపొంచే విద్యానందించాలి. వారి హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి.

 వ్యాసకర్త సెల్: 9440245771