30 నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్
28-09-2024 02:43 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సు ల్లో ప్రవేశాల కోసం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌ను ఈనెల 30 నుంచి చేపట్టనున్నారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. 4న సీట్ల కేటాయింపు, 5 వరకు ట్యూ షన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, 7 వరకు నేరు గా కాలేజీలకు వెళ్లి రిపోరింగ్ చేయాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. 6వ తేదీ నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపారు.




