27 March, 2026 | 2:47 AM

ఇషాన్ కిషన్ సెంచరీ.. హైదరాబాద్ భారీ స్కోరు

23-03-2025 05:44 PM

ఐపీఎల్ 2025 లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరును నమోదు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 286/6 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్(34), నితీష్ రెడ్డి(30), అభిషేక్ శర్మ(24) పరుగులతో మెరిపించారు