18 May, 2026 | 6:05 PM

మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేత

18-05-2026 05:05 PM

మల్లాపూర్, మే, 18(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఇటీవల వివిధ కారణాల వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు మరణ ధ్రువీకరణ పత్రాలను గ్రామ సర్పంచ్ కళా రమేష్, వార్డ్ సభ్యులు అందజేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఈ పత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కళా రమేష్  మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను సకాలంలో అందించడం గ్రామపంచాయతీ బాధ్యత అని తెలిపారు. బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి ఇంటి వద్దకే సేవలు అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.