20 July, 2026 | 5:39 PM

Breaking News

వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •  

పల్లె తల్లుల చలువే !

20-07-2026 12:00 AM

పల్లె తల్లుల రొమ్ముతాగి

ఎదిగిన పసి పిల్లలు

పల్లెల చెమటచుక్కలతో పోగేసిన 

సంపదల సరస్సులో

తుళ్లుతూ ఎగురుతున్న చేపపిల్లలు

పల్లెలు చొక్కా లేకుండా తిరగటంవల్లే

నగరాలు ప్యాంటూ షర్టేసుకుని కులుకుతున్నాయి

దేశ దేహంనిండా

నగరాలు నరాలై తేలుతోంది

పల్లెల చెమట రక్తమై ప్రవహించటం వల్లే

కొమ్మల్లా విస్తరించిన నగరాలకు

బలాన్ని సమకూర్చిన చెట్టు వేర్లు పల్లెలే 

ఇవాళ నగరాలు 

చెట్టంత ఎదిగిన కొడుకులయ్యాయంటే

పెంచి పెద్ద చేసిన పల్లెతల్లుల చలువే

మూలాలు మరచిపోతే పుట్టగతులుండవు

పునాదుల్ని కూల్చుకుంటే

లేచిన మేడలు నిలబడవు

వృద్ధాప్యంతో శిథిలమవుతున్న పల్లెతల్లుల్ని

ఎదిగిన కొడుకుల్లా దగ్గరికి 

తీసుకోవాల్సింది నగరాలే !

 చిత్తలూరి