కొలువులపై కాంగ్రెస్ వైఖరేమిటి?
డా. తిరునహరి శేషు :
* రెండేళ్ల తమ పాలన పూర్తయ్యే నాటికి లక్ష ఉద్యోగాల మార్క్ ని దాటుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు?
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధానంగా రాజకీయ పార్టీ లు తమ మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీని పొందుపరుస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్రంలోని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీ లు, గతంలో పాలించిన పార్టీలు హామీలి చ్చాయి.
కానీ, అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ విషయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తమ హామీలను నిలబెట్టుకోలేకపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఆయా పార్టీలు అనేక హామీలిచ్చాయి. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వైఖరితో నిరుద్యోగ యువత మరొకసారి మోసపోయామనే అ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నది.
‘ప్రభుత్వం వెం టవెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వ డం వల్ల పరీక్షలకి మేము సన్నద్ధం కాలేకపోతు న్నాం. కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వవద్దని నిరుద్యోగులే విజ్ఞప్తి చేస్తున్నారు’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ‘మా రోజులలో మేము ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లం. కానీ మీరు ఎంత అ దృష్టవంతులయ్యా! మీకోసం ఇప్పు డు ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి’ అని ఆం ధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత చెప్పి న మాటల పట్ల నిరుద్యోగ యువత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది.
తప్పుల్లో ఇది ఒకటా!
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నిధులు,- నీళ్లు, నియామకాలలో తెలంగాణ భూమిపుత్రులకి అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆంధ్ర పాలకులు ముల్కీ నిబంధనలు పాటించకుండా ప్రభు త్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల ఉద్యోగ నియామకాలలో స్థానిక తెలంగాణ నిరుద్యోగ యువతకి అన్యాయం జరిగిందని 1952లో ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘మా కొలువులు మాకే కావాలి’ అనే నినాదంతో నిరుద్యోగ యువత ఉద్యమించింది.
తెలంగాణ రాష్ట్రం వస్తే మన కొలువులు మనకే దక్కుతాయని నాటి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగ యువత ముందు వరుసలో నిలబడి కొట్లాడింది. కానీ, రా ష్ట్రం ఏర్పాటైన తరువాత కొలువుదీరిన మొ దటి ప్రభుత్వం తన దశాబ్దపు పాలనలో చేసిన మొదటి తప్పు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ప్రభు త్వ ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కార్ వ్యవహరించిన తీరుతో కొలువుల కోసం కొట్లాడిన యువతకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి అన్యాయం జరిగింది.
నాటి ప్రభుత్వం తన పది సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 1,62,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగలిగింది. రా ష్ట్రంలో ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అ యిన టీజీపీఎస్సీ ద్వారా 35 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారంటే ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నాటి ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు.
కానీ, హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చే సే క్రమంలో గ్రూప్--1 లాంటి అత్యున్నత ప రీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావటం, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడం తో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నాటి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎన్నికలలో ఆ పార్టీ ఓటమికి కారణమైంది.
నాటి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఒక నాయకుడు ఇటీవల తాము తప్పులు చేయ డం వల్లనే ఓడిపోయామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బహుశా ఆ ప్రభుత్వం చేసిన ప్రధాన తప్పిదాలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఫల్యం ఒకటై ఉండవచ్చు.
గత ప్రభుత్వ వైఖరేనా!
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి అనేక హామీలు ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన మొదటి సం వత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రక టించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 31 నెలల కాలంలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది.
ఈ ఉద్యోగాలలో కూడా 50,785 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినవే. మిగతా 16,978 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇక్కడ రెండు మౌలిక ప్రశ్నలు ఉ త్పన్నమవుతున్నాయి. ఒకటి 2022 మార్చి 8న నాటి ప్రభుత్వాధినేత శాసనసభలో 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
కానీ, ఆ ఉద్యోగాలు ఇప్పటివరకు ఎందుకు భర్తీ కాలేదు? రెండవది అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలోనే తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేసి ఒకే నోటిఫికేషన్‌లో 1,30,000 ప్రభు త్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో అలాంటి చొరవ చూపించలేకపోయింది.
తెలంగాణ మొదటి పీఆర్సీ చైర్మన్ బిస్వా ల్ రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉ ద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తన నివేదికలో స్పష్టం చేశారు. రెండేళ్ల తమ పాలన పూర్త య్యే నాటికి లక్ష ఉద్యోగాల మార్క్ ని దాటుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పా రు. కానీ, కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ఉద్యోగాల భర్తీలో ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు.
రెం డు లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు! కనీ సం గత ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలను భ ర్తీ చేయలేకపోయారు. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు, నిరుద్యో గ భృతిని ఇవ్వలేకపోయారు. నిరుద్యోగ యువతకి రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం చేయలేకపోయారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ చెప్తున్నారు.
కానీ, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు అడిగారు? ఖాళీగా ఉన్న ఉద్యోగాలకే నోటిఫికే షన్ ఇవ్వమని అడిగారు కదా! పోలీస్ శాఖ లో ఖాళీగా ఉన్న 19 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది? ప్రభు త్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభు త్వం కూడా గంభీర ఉపన్యాసాలు, కట్టలు తెగే ఆవేశపు హామీలు తప్ప నిరుద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదని నిరుద్యోగులు వాపోతున్నారు.
కుడి ఎడమల దగా
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, 40 వేల ఉద్యోగాలకి త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు నమ్మి నిరుద్యోగులు నాడు అశోకవనంలో రాముడి కోసం ఎదురుచూసిన సీతమ్మలాగా నేడు అశోక్ నగర్‌లో కళ్లలో ఒత్తులు వేసుకొని నోటిఫికేషన్ల కో సం ఎదురుచూస్తున్నారు. చివరికి రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా నిరుద్యోగులకి నిరాశే మిగిల్చింది.
‘ఉద్యోగాల కోసమే రాష్ట్ర సాధన కొట్లాట అని చెప్పినవారు, వారి ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినవారు, కొలువుల కొట్లాట ఉద్యమానికి పిలుపునిచ్చి వారికి ఉద్యోగం రాగానే సమావేశాలతో కాలం వెళ్లబుచుతున్నవారు, ఎన్నికలలో ఒక పార్టీకి వ్యతిరేకంగా, మరొక పార్టీకి అనుకూలంగా నిరుద్యోగులలో ఆశలు కల్పించి బస్సు యాత్ర చేసిన వారు ఇప్పుడెక్కడ?’ అని నిరుద్యోగులు ప్ర శ్నిస్తున్నారు. గత పాలకులు చంపి సంతాప సభ పెడితే, నేటి పాలకులు నమ్మిం చి మో సం చేశారని నిరుద్యోగులు మరొకసారి కొ లువుల కొట్లాటకు నడుం బిగిస్తున్నారు.
వ్యాసకర్త సెల్: 9885465877






