calender_icon.png 18 February, 2026 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర సాధన, అంకితభావంతోనే సాధ్యం

18-02-2026 12:00:00 AM

డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి

మెయిన్స్‌లో విజన్ జూనియర్ కాలేజీ విద్యార్థు ప్రతిభ

మేడిపల్లి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ 2026 (సెషన్-1)లో బోడుప్పల్ సర్కిల్ లోని విజన్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో, కళాశాల విద్యార్థులు ఎ కౌశిక్ వర్ధన్, ఎస్. సౌమ్య శ్రీ ఇతర విద్యార్థులు (87.01%+) ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీ య స్థాయిలో ఎన్‌ఐటిలు, త్రిబుల్ ఐటిలు, అగ్రశ్రేణి బ్రాంచ్లలో సీట్లు సాధించారని, అంతేకాకుండా ఐఐటీ ఎంట్రన్స్ జే ఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పుష్పగుచ్ఛాలతో విద్యార్థులను అభినందించి, వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యా విధా నం, నిరంతర సాధన, గురువుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ అద్భుతమైన ఫలితం సాధ్యమైందన్నారు.

భవిష్యత్తులో ఐఐటీలలో సీట్లు సాధిం చి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల కార్యదర్శి కరస్పాండెంట్ భావన రిషి, కళాశాల బోధ నా సిబ్బంది కృ షి, ప్రిన్సిపాల్ రమాకాంత్, వైస్ ప్రిన్సిపాల్ సుమతి మద్దతుతో విద్యార్థులు అంకితభావంతో విజయం సాధించా రని డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.