calender_icon.png 2 December, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు

02-12-2025 01:27:49 PM

హైదరాబాద్: నగరంలో కొన్ని ప్రముఖ హోటళ్లు, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు కొనసాగుతున్నాయి. లక్డీకాపూల్ లోని వుడ్ బ్రిడ్జ్ హోటల్ లో అధికారులు తనిఖీలు నిర్వహించి, అనంతరం హోటల్ యజమాని హర్షద్ ను ప్రశ్నించారు. హోటళ్లో భారీగా నగదు, ధ్రువపత్రాలు గుర్తించామని, ప్రముఖ హోటళ్ల లింక్స్ హోటళ్లపైనా దృష్టి పెట్టినట్లు  ఐటీ అధికారులు తెలిపారు. పిస్తా హౌస్, షా గౌస్, మేహిఫిల్ వంటి హోటళ్లతో పాటు క్యాప్స్ గోల్డ్ వంటి వ్యాపార సంస్థలతో సంబంధాలపై అధికారులు విచారించారు. గతంలో కూడా  పిస్తా హౌస్, షా గౌస్, మేహిఫిల్ వంటి హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.