02-12-2025 11:41:41 AM
హైదరాబాద్: మన్సూరాబాద్ శివగంగకాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాలుడిపై వీధికుక్కలు(Stray dogs attack boy) దాడి చేశాయి. బాలుడు ప్రేమ్ చంద్ కు తీవ్రగాయాలు కావడంతో తక్షణమే నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది కుక్కలను పట్టుకుపోయారు. చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.