20-02-2026 12:35:56 AM
జిల్లా ఉన్నత అధికారులకు సమగ్ర నివేదిక
బోయినపల్లి: ఫిబ్రవరి 19(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక సబ్ సెంటర్ ఏ ఏ ఎన్ పై గురువారం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత విచారణ జరిపారు. కొదురుపాక గ్రామానికి చెందిన మై లారం లాస్య జనవరి 4న డెలివరీ కోసం వే ములవాడ ఏరియా ఆసుపత్రికి స్థానిక ఆశ వర్కర్ తో కలిసి వెళ్లారు. నాలుగు గంటలు వేసి చూసిన వైద్య సిబ్బంది ఎవరు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డెలివరీ చే యించుకోగా మగ బిడ్డ జన్మించారు. ఆ బిడ్డకు బుధవారం నెలరోజు టీకా వేయించేందుకు కొదురుపాక సబ్ సెంటర్ కు వెళ్లా రు.
సబ్ సెంటర్లో ఉన్న ఏఎన్‌ఎం లక్ష్మి మై లారం లాస్యను ఇక్కడికి ఎందుకు వచ్చావని బయటకు వెళ్లిపోవాలని అసలు ఆడదానివే నా అని నోటికి వచ్చిన బూతులు తిట్టి అవమానించారు. దీంతో బాధిత మహిళ లాస్య తన సెల్ ఫోన్ లో మొత్తం రికార్డు చేశారు. బుధవారం సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆమె వచ్చి వి చారణ జరిపారు. తొలుత బాదిత మహిళ తో మాట్లాడి సమగ్రంగా విన్నారు. అనంతరం ఏఎన్‌ఎం తో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏఎన్‌ఎం ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని దీనిపై సమగ్ర నివేదిక జిల్లా ఉన్నతాధికారులకు ఇస్తున్నట్లు చెప్పారు.