calender_icon.png 6 June, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి గంటకు వేళాయె

04-06-2025 12:00:00 AM

  1. జిల్లాలో 48% స్కూల్ బస్సులకు మాత్రమే పిట్నెస్ జారీ

సమర్జ్య పరీక్ష చేసినవి 377 చేయాల్సినవి 418

ఖమ్మం, జూన్ 3 (విజయ క్రాంతి ):ఒక ప్రక్క స్కూల్ లు ఈ నెల 12 నుండి ప్రారం భం అవుతుండగా, మరోప్రక్క నేటికీ జిల్లా లో 48 శాతం బస్సు లకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ లు జారీ చేయబడ్డాయి. జిల్లా లో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు శిక్షణ  తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రారంభ ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరం నుండే ఈ విద్య సంవత్సరం కు అడ్మిషన్ ల ప్రక్రియ కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభించాయి ...

కానీ కొన్ని ప్రైవేట్ స్కూ ల్ యాజమాన్యాలు మాత్రం వారి స్కూల్ బస్సు లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లను నేటి వరకు కూడా తీసుకోవటములో తాత్సరం చేస్తున్నారు.జిల్లాలో ని  ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధిలో 795 ప్రైవేట్ స్కూల్ బస్సులు వున్నవి, వీటిలో నేటికీ 375 స్కూ ల్ బస్సు లకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ లు జరిచేయబడ్డాయి.

మిగతా బస్సు లు కొన్ని నేటికీ సంబంధిత ఎంవిఐ కార్యాలయా లకు రాలేదు, కొన్ని బస్సు లు వచ్చిన కొన్ని లోపాలతో తిరిగి పంపారు. ఒక  ఖమ్మం ఎం వి ఐ కార్యాలయం పరిధిలో 504 స్కూల్ బస్సు లు ఉండగా నేటికీ 217 బస్సు లకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయబడ్డవి.

కఠినంగా వ్యవహారించాలి

గత ఏడాది కొన్ని బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్   లేకుండా నే నడిపారని తెలుస్తుంది. గతంలో కొన్ని బస్సు లను అధికారులు సీజ్ కూడా చేశారు. కొన్ని బస్సు లు 15 సంవత్సరాలు పూర్తి చేసుకోన్నవి కూడా లేక పోలేదు. ఈ విద్యా సంవత్సరం అధికారులు కఠినంగా వ్యవహరించి సామర్జ్యం లేని బస్సు లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకొంటాము

స్కూల్ ప్రారంభ తేదీ లోపు అన్నీ స్కూల్ బస్సు లు సమర్జ్య పరీక్ష సర్టిఫికెట్ పొందాల సిందే నని, ఒకవేళ ఎవరైనా తీసుకోక పోయినా నోటీసులు పం  పుతామణి, సమర్జ్య సర్టిఫికెట్ లేకుండా రోడ్డు మీద బస్సు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.

 వాకదాని వెంకట రమణ, ఇంచార్జి ఆర్‌టీఓ, ఖమ్మం