24 June, 2026 | 6:10 PM

నేడు ఇక్సిగో ఐపీవో

10-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 9: ఈ వారం మెయిన్‌బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో రెండు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల(ఐపీవోలు)పై ఇన్వెస్టర్ల ఆసక్తి ఉన్నది. ట్రావెల్ ప్లాట్‌ఫాం ఇక్సిగోను నిర్వహిస్తున్న లే ట్రావెన్యూస్ టెక్నాలజీస్ రూ.120 కోట్ల విలువైన తాజా షేర్లను మార్కెట్లో జారీచేస్తున్నది.  ఐపీవో జూన్ 10న ప్రారంభమై జూన్ 12న ముగుస్తుంది. లే ట్రావన్యూస్ ఆఫర్ రూ.88 ప్రైస్‌బ్యాండ్‌తో వస్తున్నది. ఈ కంపెనీ శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 333 కోట్లు సమీకరించింది.  

క్రొనాక్స్ ల్యాబ్ లిస్టింగ్

గతవారం ఐపీవో జారీచేసిన క్రొనాక్స్ ల్యాబ్ సైన్సెస్  షేర్లు జూన్ 10న స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టవుతాయి. స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ అయిన క్రొనాక్స్ ల్యాబ్ రూ.130 కోట్ల సమీకరణకు రూ.136 ఇష్యూ ధరతో జారీచేసిన ఐపీవో 117 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఇది కాకుండా ఎస్‌ఎంఈ విభాగంలో 3సీ ఐటీ సొల్యూషన్స్, మజెంటా లైఫ్ కేర్, శాట్రిక్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంపనీల షేర్లు జూన్ 12న లిస్టవుతాయి.