24 June, 2026 | 5:04 PM

డిపాజిటర్లకు మంచి సమయం

10-06-2024 12:05 AM
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరింత వడ్డీ

బ్యాంక్ బజార్ సీఈవో 

న్యూఢిల్లీ, జూన్ 9: రిజర్వ్‌బ్యాంక్ తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రెపో రేటును యథాతథంగా అట్టిపెట్టడంతో బ్యాంక్‌లు, నాన్ గ్ ఫైనాన్స్ కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తా యని, అలాగే రుణ రేట్లు సైతం గరిష్ఠస్థాయిలోనే ఉంటాయని విశ్లేషకులు చెపుతున్నారు. అంతేకాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంక్‌లు వాటికి మరింత అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయని బ్యాంక్ బజార్ సీఈ వో అదిల్ షెట్టి చెప్పారు. అంతేకాకుండా వినియోగదారులకు రుణాలు ఖరీదవుతాయన్నారు. బ్యాంక్‌లు వాటి లెండింగ్, డిపాజిట్ రేట్లను సమతౌ ల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయని, దీంతో ఎఫ్‌డీలపై గరిష్ఠ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయని, ఇది డిపాజిటర్లు అధిక రాబడులు పొందేందుకు మంచి సమయమని సూచించారు. రిజర్వ్‌బ్యాంక్ తన పాలసీ సమీక్షలో కీలకమైన రెపో రేటును 6 శాతం వద్ద అట్టిపెట్టిన సంగతి తెలిసిందే.