24 June, 2026 | 7:25 PM

పాసింజర్ వాహన విక్రయాలు

10-06-2024 12:05 AM

జూన్ 13న వెలువడే మే నెల పాసింజర్ వాహన (పీవీ) విక్రయాల అంకెల కోసం మార్కెట్ ఆసక్తిగా వేచిచూస్తున్నది. 2024 ఏప్రిల్ నెలలో పీవీ అమ్మకాలు గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే 8.9 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయాయి. కొవిడ్ పాండమిక్ తర్వాత ఏర్పడిన పెంట్ డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ విధానాల కొనసాగింపు, అంచనాలకంటే మెరుగైన రుతుపవనాలతో క్రమేపీ డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని పరిశ్రమ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.